‘ఎన్నికల వేళ కేసీఆర్ దొరకు బీసీలు గుర్తుకొచ్చారు’

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘ఎన్నికల వేళ కేసీఆర్ దొరకు బీసీలు గుర్తుకొచ్చారు. ఓట్ల కోసం లక్ష సాయమంటూ ‘నయా’వంచనకు తెరలేపాడు. ఇప్పటికే దళితబంధు పేరుతో దళితులను దగా చేశాడు. గిరిజనబంధు అంటూ ఊరించి గిరిజనులను ఉసూరు మనిపించాడు. ఇప్పుడు బీసీలను మోసం చేసేందుకు సిద్ధమయ్యాడు దొర. 9 ఏళ్లుగా బీసీలకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టించాడు. బీసీలకు 55వేల కోట్ల బడ్జెట్ అని చెప్పడమే కాని రూపాయి ఇచ్చింది లేదు. స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తుంటే ఒక్కరికీ లోన్ ఇవ్వలేదు. బీసీ బిడ్డలకు రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్‌కు దిక్కులేదు.
ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.3 వేల కోట్లు కేటాయిస్తే రూ.3 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఐదేండ్ల కింద హామీ ఇచ్చిన ‘బీసీ సబ్ ప్లాన్’ అటకెక్కింది. 50 శాతం రిజర్వేషన్లు పెంచాలనే ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. మంత్రివర్గంలో బీసీలకు తగిన ప్రాధాన్యతే లేదు. బీసీల ఆత్మగౌరవ భవనాలు పునాదులు దాటలేదు. బీసీల కుల గణన అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి తెర చాటున కేంద్రంతో లాలూచీ పడ్డాడు. బీసీ బిడ్డలు బర్లు, గొర్లు కాచుకోవాలే.. చేపలు పట్టుకోవాలే.. కేసీఆర్(KCR) కుటుంబం మాత్రం రాజ్యాలు ఏలాల్నా? ఇన్నాళ్లు బీసీలంటే చిన్నచూపు చూసిన దొరకు.. 60లక్షల బీసీ కుటుంబాలు బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉన్నాయి.’’ అంటూ సోషల్ మీడియా వేదికగా కేసీఆర్‌పై షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...