ఆయన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఒక మండల అధికారి. ఆయనకు కరోనా సోకింది. కానీ మనోధైర్యంతో కరోనాను జయించారు. అంతా హ్యప్పీగా ఉందనుకున్నాడు. ఇంటిదగ్గర ఎన్నిరోజులుంటమని డ్యూటీలో చేరారు.
కానీ డ్యూటీలో చేరిన రెండు రోజుల తర్వాత ఆయనకు గుండెపోటు వచ్చి మరణించారు. ఈ ఘటన ఉద్యోగ వర్గాలను కలవరపాటుకు గురిచేసింది.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎంపిడిఓ అశోక్ కరోనా నుంచి కోలుకుని డ్యూటీలో చేరిన రెండు రోజుల తర్వాత మరణించారు. ఆప్టర్ కోవిడ్ ప్రికాషన్స్ విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కరోనాను జయించాము కదా అనుకుని నిర్లక్ష్యంగా ఉండరాదని డాక్టర్లు పదే పదే చెబుతున్నారు.
రక్త ప్రసరణ, శ్వాస విషయంలో అప్రమత్తత ఉండాలని సూచిస్తున్నారు. అశోక్ మృతితో ఎల్లారెడ్డి ఎంపిడిఓ ఆఫీసులో విషాదం నెలకొంది.