ఏపీ హోంమంత్రికి షాక్….

ఏపీ హోంమంత్రికి షాక్....

0
119

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఒకరి తర్వాత మరోకరు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు… నిన్నా మొన్నటిదాక గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు కుల దృవీకరణ పత్రం సమర్పించిందనే ఉద్దేశంతో నోటీసులు అందుకుంది…

గతంలో ఆమె తాను ఎస్సీ కాదని క్రిస్టియన్ ని అని చెప్పారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న లీడల్ రైట్స్ ప్రొటక్షన్ ఫోరాం కోర్టును ఆశ్రయించింది… అంతేకాకుండా రాష్ట్రపతికి కూడా ఈ అంశాన్ని ఫిర్యాదు చేశారు… ఇక ఇదే క్రమంలో శ్రీదేవిలాగనే హోంమంత్రి సుచరిత కూడా అదే షెడ్యూల్ కుల దృవీకరణ వివాదంలో చిక్కుకుంది…

గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె తాను ఎస్సీని కాదని క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నట్లు తెలిపారు…దీంతో ఎస్సీ కుల ధృవీకరణను దుర్వినియోగం చేసినందున అస్సాం కేంద్రంగా పనిచేసిన నార్త్ ఈస్ట్ ఇండియా సుచరితపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది… ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది…