గీత గోవిందం మూవీ రివ్యూ

గీత గోవిందం మూవీ రివ్యూ

0
112

చిత్రం : గీత గోవిందం మూవీ రివ్యూ
నటీనటులు: విజయ్ దేవరకొండ ,రష్మిక
సంగీతం: గోపి సుందర్
కథ: జాన్
నిర్మాత: బన్నీ వాసు
దర్శకత్వం:పరశురామ్

కథ :

కట్ చేస్తే తన లవ్ స్టోరీ చెబుతూ ఫ్లాష్ బ్యాక్ మొదలు పెడతాడు గోవిందం (విజయ్ దేవరకొండ). ఆకతాయిగా ఉండే గోవిందం ఓ బస్ జర్నీలో గీతా (రష్మిక)ను చూసి ఇష్టపడి ఆమెని సరదాగా ఆట పట్టిస్తాడు. దానితో గీతకు గోవిందం మీద నెగటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది. అనుకోకుండా గీత బ్రదర్ తోనే గోవిందం సిస్టర్ పెళ్లి జరుగుతుంది. ఇక ఆ టైంలో తన మీద పగ తీర్చుకుంటుంది గీత. సుబ్బరాజు కూడా చెల్లిని బస్ లో ఆటపట్టించిన అతను గురించి వెతుకుతాడు. సుబ్బరాజుకి తన చెల్లిని ఏడిపించిన వాడు దొరికాడా, గీతా ని గోవిందం ఎలా మెప్పించాడు అన్నది ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో అసిస్టెంట్ ప్రొఫిసర్ గా నటించిన విజయ్ దేవరకొండ చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన నటనతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

ఇక కథానాయకిగా నటించిన రష్మిక, గీత పాత్రలో చాలా చక్కగా నటించింది తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరో ప్రేమలో పడేయటానికి చేసే ప్రయత్నాలకు సంబంధించిన సన్నివేశాల్లో ఆమె నటన, ఆ సందర్భంలో కళ్లల్లో ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి.
విజయ్ కు తండ్రి పాత్రలో నటించిన నాగబాబు తన గాంభీరమైన నతనతో ఆకట్టుకోగా వెన్నెల కిషోర్, రాహుల్ రామ్ క్రిష్ణ, అభయ్ తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో ఉన్నంతలో బాగానే నవ్వించారు. ముఖ్యముగా వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేసారు.

మైనస్ పాయింట్స్:

మొదటి భాగం సరదాగా సాగిన, రెండువ భాగం మొదట్లో మాత్రం కథనం కొంత నెమ్మదిగా సాగుతుంది. దానికి తోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం లోపించినట్లు అనిపిస్తోంది.

నటి నటుల పని తీరు :

విజయ్ దేవరకొండ గోవిందం పాత్రలో అద్భుతంగా కనిపించాడు. సినిమా మొత్తం తన భుజాన వేసుకుని చేశాడని చెప్పొచ్చు. గీత పాత్రలో రష్మిక కూడా బాగానే చేసింది. వెన్నెల కిశోర్ కామెడీ బాగుంది. చివర్లో అన్నపూర్ణ పాత్ర అలరించింది.ఈ సినిమాలో మిగిలిన నటీనటులంతా తమ పాత్ర కు తగ్గట్టు నటన కనబరిచారు.

రేటింగ్ – 3.0

చివరిగా – గీత గోవిందం ఓకే అనిపించింది