ఇండియా తొలి కోవిడ్ పేషెంట్ యువ డాక్టరమ్మకు మళ్లీ పాజిటీవ్

0
113

భారత దేశంలో కోవిడ్ మొట్ట మొదటి పేషెంట్ కేరళ రాష్ట్రానికి చెందిన ఒక యువ డాక్టరమ్మ. ఆమె మెడికల్ స్టూడెంట్. ప్రస్తుతం ఆమెకు రెండోసారి కోవిడ్ పాజిటీవ్ నిర్దారణ అయింది. ఈవిషయాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు.

కరోనా ఎక్కడ పుట్టిందని ఇప్పటివరకు ప్రచారంలో ఉందో ఆ నగరమైన చైనాలోని వూహాన్ లోని యూనివర్శిటీలో ఈ స్టూడెంట్ వైద్య విద్య అభ్యసిస్తున్నారు. ఆమె 2020లో సెలవుల్లో స్వదేశానికి వచ్చారు. అదే ఏడాది జనవరి 30వ తేదీన కరోనా సోకింది. తొలి కరోనా పాజిటీవ్ కేసు ఆమెదే. అయితే తర్వాత చికిత్స పొంది కోలుకున్నారు.

ఇప్పుడు ఢిల్లీలో చదివేందుకు వెళ్తున్న సమయంలో ఆర్టీపీసీఆర్ చేయించుకోగా కోవిడ్ వైరస్ సోకినట్లు రిపోర్ట్ వచ్చింది. అయితే యాంటిజెన్ టెస్టులో మాత్రం నెగిటీవ్ వచ్చింది. ప్రస్తుతం ఆమెలో కరోనా లక్షణాలు కనిపించడంలేదని అధికారులు వెల్లడించారు. హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.