జనసేన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్‌ రిలీజ్ చేసిన పవన్

జనసేన మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్‌ రిలీజ్ చేసిన పవన్

0
43

ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల ఫీవర్ అప్పుడే రాజకీయ పార్టీల్లో మొదలైనట్లు కనిపిస్తోంది.తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విజన్ డాక్యుమెంట్‌ను రిలీజ్ చేశారు. అయితే ఇది కేవలం విజన్ డాక్యుమెంట్ మాత్రమే అని మేనిఫెస్టోలోని కొన్ని మచ్చుతునకలని జనసేన అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలు చేపడుతుందని ఆ పార్టీ పేర్కొంది.

విజన్ డాక్యుమెంట్‌లో ఉన్న 12 అంశాలు ఇవే…
1. మహిళలకు 33శాతం రాజకీయ రిజర్వేషన్లు
2. గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలెండర్లు
3. రేషన్‌కు బదులుగా మహిళల ఖాతాల్లో రూ.2500-3500/వరకు నగదు
4. బీసీలకు అవకాశాన్ని బట్టి 5శఆతం వరకూ రిజర్వేషన్లు పెంపుదల
5. చట్టసభల్లో షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు
6. కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు
7. ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం
8. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కోసం కార్పొరేషన్
9. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతిగృహాలు
10. ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాలు
11. ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ విధానం రద్దు
12. వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు