ఆనందయ్య మందు… అమ్మ చిట్కా

anandhaiah ayurveda medicine anandhaiah corona medicine anandhaiah covid medicine ram gopal verma criticize anandhaiah medicine drugs mafia vs anandhaiah ayurveda medicine

0
123

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం అనే మారుమూల పల్లెటూరులో 80 వేల మందికి ఉచితంగా కరోనా కు ఆయుర్వేద ముందు ఇచ్చిన బొణిగెల ఆనందయ్యపై ఒక సెక్షన్ వారు విమర్శలు, ధూషణలు, శాపనార్థాలు పెడుతున్న ప్రస్తుత సమయంలో నాకు చిన్ననాటి ముచ్చట్లు షేర్ చేసుకోవాలనిపించింది. మాది నల్లగొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గంలోని కొండకిందిగూడెం అనే ఊరు.

 

అప్పట్లో ఎండాకాలంలో మా ఇంట్లో మా అన్న కండ్లు గర గరా అంటున్నాయి, మంటగా ఉన్నాయి అని అప్పుడప్పుడు చెబుతూ ఉండేవాడు. దానికి కారణం వేడి వల్ల అనుకునేవాళ్లం… అప్పుడు ఈ చిన్న దానికే దావఖానకు పోవుడు ఎందుకు అని మా అమ్మ ఆముదం తెచ్చి మా అన్న రెండు చెవుల్లో వేసేది. ఆయనకే కాదు ఇలా మా ఏరియాలో చాలామంది వేడి ప్రభావం కండ్ల మీద పడితే వెంటనే చెవుల్లో ఆముదం వేసుకునేవారు. ఆముదం వేసిన కొద్దిసేపటికే కండ్లలో వేడి తగ్గి హాయిగా ఉండేదని మా అన్న చెప్పేవాడు.

 

మా అమ్మకు అక్షరం ముక్క చదువు రాదు. కానీ ఎప్పటినుంచో కండ్లు మంటగా ఉంటే ఆముదం చెవుల్లో వేస్తే రిలీఫ్ వస్తుందని తెలుసుకుని ఆ వైద్యం ఇంట్లో అమలు చేసేది. మంచి రిజల్ట్ ఉండేది. ఆనందయ్య కరోనాతో ఊపిరిపీల్చుకోలేక అవస్థలు పడుతున్న వారి కండ్లలో మందు వేయడం వల్ల గంటల వ్యవధిలో వారు రిలాక్స్ అవుతున్నారని ఇలా చాలామందికి నయమైందని నేను విన్నాను. ఈ విషయంలో కొందరు చదువుకున్నవారు, డ్రగ్ మాఫియా, మెడికల్ మాఫియా, కార్పొరేట్ మాఫియా తొత్తులు హేళన చేస్తూ రాక్షసానందం పొందే ప్రయత్నం చేస్తున్నారు.

 

నిన్న నా స్నేహితుడు అడ్వకెట్ అరుణ్ కుమార్ ఫోన్ చేసిండు. ఆనందయ్య టాపిక్ కూడా మా మధ్య చర్చకు వచ్చింది. కోటయ్య అనే కరోనా సోకిన వ్యక్తికి ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోయిన తరుణంలో కృష్ణపట్నం తీసుకురాగా కంట్లో ఆనందయ్య మందు వేస్తే కొద్దిసేపటికే లేచి కూర్చున్నారన్న టాపిక్ నడిచింది. అప్పుడు అరుణ్… తాను బైపిసి స్టూడెంట్ అని గుర్తు చేస్తూ… చెవులు, ముక్కు, కళ్లకు మధ్య సూది మొన మందంలో ఇంటర్ లింక్ ఉంటుందని అన్నారు. అంటే కంట్లో వేసిన మందు అంతిమంగా ముక్కుల ద్వారా ఊపిరితిత్తులకు చేరి రిలీఫ్ ఇస్తున్నదని అరుణ్ చెప్పినమాట. అలా ఈ చర్చ జరిగింది. ఈ విషయంలో శాడిస్టు దర్శకుడిగా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ సహా కొన్ని మీడియా సంస్థలు హేళన చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అర్థం పర్థం లేని వాదనలు చేస్తున్నాయి.

 

అల్లోపతి చుట్టూ మాఫియా కోటలు కట్టుకున్న ఈరోజుల్లో ఆయుర్వేదాన్ని ఇంకా ఆ మాఫియా తాకలేదు. అల్లోపతి ఎంతగా ఎదిగినా ఆయుర్వేదాన్ని ఇప్పటికీ జనాలు పక్కన పడేయలేరు. కోట్లు కొల్లగొట్టాలనుకుంటే ఆనందయ్య లాంటి వాళ్లు ఉచితంగా కరోనా మందు ఇవ్వడం రుచించని మాఫియా, దానికి వత్తాసు పలికే మీడియా ఇవాళ ఆనందయ్య మీద పడి ఏడుస్తున్నారు.

 

ఇక్కడ అల్లోపతిని తక్కువ చేయడమో, ఆయుర్వేదాన్ని ఆకాశానికెత్తడమో కాదు.. రాద్దాంతం, అయోమయం తగదు అని నేను చెప్పదలుచుకున్నాను. హాని లేనపుడు, జనాలు నమ్ముతున్నప్పుడు ఆనందయ్య మందుపై విష ప్రచారం వద్దు అని మనవి చేస్తున్నాను.

 

ఇట్లు
అల్లి నాగరాజు
జర్నలిస్టు
హైదరాబాద్.