టీమిండియాకు అభినందనలు తెలిపిన సూపర్ స్టార్

టీమిండియాకు అభినందనలు తెలిపిన సూపర్ స్టార్

0
57

భారత్ వన్డే సిరీస్ ఆస్ట్రేలియాపై విజయం సాధించడంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు “ఆస్ట్రేలియాలో తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను గెలిచిన టీమిండియాకు అభినందనలు…. భారత క్రికెటర్లు అద్భుతంగా ఆడారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన ఎంఎస్ ధోనీకి ప్రత్యేక అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు. ఇంకా పలువురు క్రికెట్ అభిమానులు, సినిమా ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా టీమిండియాను అభినందించారు. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సిరీస్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. దాదాపు 72 ఏళ్ల భారత క్రికెట్ అభిమానుల కలల్ని నిజం చేసింది కోహ్లీసేన. ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ చిత్రమైన “మహర్షి” సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే… మరోవైపు ఇలా క్రికెట్, సినిమాల వంటి అంశాలపై సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు మహేష్.