ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది.. ముఖ్యంగా ఏపీలో కరోనా కేసులు రోజుకు 10 వేల కేసులు నమోదు అవుతున్నాయి… దీంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు… ఈ మాయదారి మహమ్మారి ఎవ్వరిని వదలకుంది… ఇప్పటికే అధికార వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే…
అయితే తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా కరోనా బారీన పడ్డారు… దీంతో ఆయన వెంటనే హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు తన వెంట తిరిగిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని హోం ఐసోలేషన్ లో ఉండాలని తెలిపారు అవినాష్ రెడ్డి…
కాగా అవినాష్ రెడ్డి నిత్యం ప్రజలమధ్యలో తిరుగుతుంటారు.. ప్రజలకు ఏ అవరం వచ్చినా అది నెరవేర్చుతుంటారు… కరోనాను లెక్క చేయకుండా అవినాష్ రెడ్డి ప్రతీ గ్రామంలో పర్యటిస్తున్నారు.. మరో వైపు జగన్ మోహన్ రెడ్డి 1,2 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు…