ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్రలో యంగ్ హీరో

ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్రలో యంగ్ హీరో

0
65

దగ్గుబాటి రానా భల్లాలదేవుడిగా ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను మంత్రముగ్ధులను చేసిన విషయం తెలిసిందే. నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమాలో రానా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు పాత్ర షోషిస్తున్నారని సమాచారం.

ఈ మేరకు సినిమాలో ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌తో కలిసి రానా ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో కలిశారు. చంద్రబాబు నాయుడు పాత్ర పోషిస్తున్న తరుణంలో ఆయన మాట, నడవడిక స్వయంగా గమనించేందుకే రానా వచ్చారని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు. కాగా, ఎన్టీఆర్ చిత్ర బృందంతో భేటీ అయిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రపదేశ్ సినీ పరిశ్రమ అభివృద్ధికి సానుకూల వాతావరణం ఉందని, ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు.