Good News : పూచికత్తు లేకుండానే 5లక్షల లోన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలనం

SBI Bank loan offer For Corona victim Family's

0
73

కరోనా చికిత్స కోసం కవాచ్ పర్సనల్ లోన్,
గరిష్ట గడువు చెల్లించే పీరియడ్ 60నెలలు,
వడ్డీ రేట్ 8.5 శాతమే.

ప్రపంచంలో కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తున్న వేళ ప్రజలు అన్నిరకాలుగా చితికిపోతున్నారు. ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలు కోట్లలో ఉన్నాయి. అయితే కరోనా వేళ ఎంతో కొంత ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. కరోనా చికిత్స కారణంగా ఆర్థికంగా నష్టపోయి చితికిపోతున్న కుటుంబాలను ఆదుకునేందుకు ‘‘కవాచ్ పర్సనల్ లోన్’’ పేరుతో ఎటువంటి సెక్యూరిటీ లేని రుణాలను ప్రవేశపెట్టింది. కోవిడ్ 19 చికిత్స్ కోసం తనకు గానీ, తన కుటుంబసభ్యుల వైద్య ఖర్చుల కోసం తన ఖాతాదారులకు ఎస్ బిఐ ఈ లోన్లు అందజేస్తున్నది. భారతదేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ తరహాలో 5లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణాలను ఎలాంటి ష్యూరిటీలు లేకుండానే మంజూరు చేస్తున్నది. దానికోసం 8.5శాతం వార్షిక వడ్డీని విధిస్తున్నది.
అయితే అందరికీ 5 లక్షలు కాకుండా 25వేల రూపాయల నుంచి 5లక్షల వరకు ఎవరైనా 8.5శాతం వడ్డీ రేటుతో లోన్ తీసుకోవచ్చు. అయితే ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఏమంటే… లోన్ తీసుకున్న మూడు నెలల వరకు ఇఎంఐ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, అలాగే ఈ లోన్ తీసుకునే వారికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా తీసుకునేది లేదని ఎస్.బి.ఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్ బిఐ కోవిడ్ సహాయక చర్యలకు అనుగుణంగా బ్యాంకులు అందిస్తున్న కోవిడ్ 19 లోన్ లలో కవాచ్ పర్సనల్ లోన్ కూడా ఒకటి అని స్టేట్ బ్యాంక్ వివరించింది. ఈ కరోనా మహమ్మారి కాలంలో కోవిడ్ సోకిన కుటుంబాల కోసం ఎటువంటి పూచికత్తు లేని వ్యక్తిగత రుణాలను ఇవ్వనున్నాము. ముఖ్యంగా ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ అకౌంట్ హోల్డర్స్ ఫ్యామిలీస్ ఆర్థికంగా చిక్కుల్లో కూరుకుపోకుండా ఉండేందుకే దీనిని ప్రవేశపెట్టాము అని ఎస్.బి.ఐ ఛైర్మన్ దినేష్ ఖారా వెల్లడించారు.