వారికీ కోటి రూపాయలు సహాయం చేసిన సూర్య

వారికీ కోటి రూపాయలు సహాయం చేసిన సూర్య

0
42
Actor Surya

చిన‌బాబు సినిమా ఇప్పుడు ట్రెండ్ సృష్టిస్తోంది.. ముఖ్యంగా ఈ సినిమా క‌లెక్ష‌న్ల సునామి సృష్టించింది అని చెప్పాలి. అలాగే కుటుంబ క‌థాచిత్రంగా మంచి పేరు సాధించింది.. ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ సినిమా నిర్మించిన విష‌యం తెలిసిందే.. ఇందులో ఆయ‌న సోద‌రుడు కార్తి హీరోగా న‌టించారు. తాజాగా ఆయ‌న పుట్టిన రోజు కార‌ణంగా సూర్య, రైతులకు భారీ విరాళం ప్రకటించారు. స్వయంగా ఆరుగురు రైతులకు 12 లక్షల రూపాయలు అందచేశారు… అలాగే రైతుల సంక్షేమం కోసం వ్యవసాయాభివృద్ధి సంస్థకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు.

ఇక చిన‌బాబు సినిమాకు మంచి స‌క్సెస్ వ‌చ్చింది, క‌లెక్ష‌న్ల విష‌యంలో ఈ సినిమా ఇప్ప‌టికే ఓ రేంజ్ లో దూసుకుపోతోంది..చినబాబు సినిమాను సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్మెంట్స్ లో స్వ‌యంగా నిర్మించారు… రైతుల విష‌యంలో హీరో విశాల్ తీసుకువ‌చ్చిన ఈ విధానం ఇప్పుడు కోలీవుడ్ లో అంద‌రూ పాటిస్తున్నారు…రైతు సమస్యలతో పాటు కుటుంబ బంధాలు, అలకలు, కోపాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు ఈ సినిమాని దర్శకుడు పాండిరాజ్‌. ఇక ఈ సినిమా తెలుగులో కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది.