IPL 2022: తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్యే..ప్రేక్షకులకు అనుమతి!

0
44

రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్​ 2022 మెగా వేలం విజయవంతంగా ముగిసింది. మొత్తంగా ఈ మెగా వేలంలో 204 ప్లేయర్లు అమ్ముడు పోయారు. ఇక ఐపీఎల్ 2022లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. కొత్తగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగుతున్నాయి. ఐపీఎల్ 2022 మార్చి 26 నుండి ప్రారంభం కానుంది. మే 29వ తేదీన అహ్మదాబాదులో జరగనున్న ఫైనల్ మ్యాచ్ తో  ముగియనుంది. ఈ మేరకు ఇటీవల జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే పూర్తి షెడ్యూల్ రిలీజ్ కానుంది.

మార్చి 26న జరగనున్న తొలిమ్యాచ్​పై అభిమానులల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు బడా జట్లతో తొలి మ్యాచ్​ను ఆడించాలని ఐపీఎల్​ నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం.   గత సీజన్​లో​ ఛాంపియన్స్​గా నిలిచిన చెన్నై సూపర్​ కింగ్స్​, రన్నరప్​గా ఉన్న కోల్​కతా నైట్​రైడర్స్​ మధ్య తొలి మ్యాచ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఒక్కో జట్టు పద్నాలుగేసి మ్యాచ్‌లను ఆడాలి. దీంతో మొత్తం 70 లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇవే కాకుండా ఫైనల్‌తో కలిపి నాలుగు ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ఉంటాయి. అలాగే 25 శాతం ప్రేక్షకులను అనుమతిచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ఐపీఎల్‌ జట్లను ఎప్పుడు లేని విధంగా రెండు గ్రూపులుగా బీసీసీఐ విభజించింది.

గ్రూప్ A:

ముంబై ఇండియన్స్ (MI)

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)

రాజస్థాన్ రాయల్స్ (RR)

ఢిల్లీ క్యాపిటల్స్ (DC)

లక్నో సూపర్ జెయింట్స్ (LSG)

గ్రూప్ B:

చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

పంజాబ్ కింగ్స్ (PBKS)

గుజరాత్ టైటాన్స్ (GT)