పెగ్గు అంటే ఏమిటి? పెగ్గు పేరు ఎలా వచ్చిందో తెలుసా?

0
165

పొద్దుగూకితే పెగ్గు వేసేవాళ్లు మనమధ్య చాలామందే ఉంటారు. పెగ్గు పడనిది ముద్ద దిగదు అంటుంటారు. పెగ్గు వేయనిదే నిద్ర రాదు అని కొందరి నోట వింటుంటాం. డెయిలీ నేను రెండు పెగ్గులు తీసుకుంటాను అన్న మాటలు మన చెవుల్లో తిరుగుతూనే ఉంటాయి. పెగ్గు వేసుకున్నమా? పడుకున్నమా అన్నట్లు ఉండాలె అని కొందరు సలహాలు ఇస్తుంటరు. ఇంతకూ పెగ్గు అంటే ఏమిటి? ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పెగ్గు అంటే మద్యాన్ని కొలిసే సాధనం. ఇంగ్లాండులో చాలాకాలం కిందట ఓ గనుల యజమాని తమ దగ్గర పనిచేసే కార్మికులకు పని పూర్తి చేసి ఇంటికి వెళ్లేటప్పుడు చలిని తట్టుకోవడం కోసం ఒక గ్లాస్ మద్యం ఇ్తూ ఉండేవాడు.

వర్కర్స్ ప్రతిరో్జు దీనికోసం ఎదురుచూసేవారు. వారు దాన్ని Precious Evening Glass (విలువైన సాయంత్రం గ్లాసు  అని ముద్దు పేరుతో పిలుచుకునేవారు. దాన్నే షార్ట్ కట్ లో P.E.G పెగ్ అనేవారు. అలా పెగ్ అనే పదం పుట్టుకొచ్చి ప్రపంచ మందు ప్రియులు, మందు ప్రియురాళ్లకు ఇష్టమైన పదంగా మారింది.