Rashmi Gowtham tweet on drunken puppy video: జబర్దస్త్ కామెడీ షోతో మోస్ట్ పాపులర్ అయిన యాంకర్ రష్మీ.. బుల్లితెర, వెండితెర తేడా లేకుండా, బిజీబిజీగా గడుపుతున్నారు. కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా.. సామాజిక సేవలోనూ రష్మీ ముందుంటుంది. కరోనా సమయంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టి తన మంచి మనసును చాటుకుంది. రష్మీ జంతు ప్రేమికురాలు. జంతువులకు, మూగ జీవాలకు హాని చేసినా, వాటిని గాయపరిచినా, అస్సలు తట్టుకోలేదు. కాగా, కొందరు యువకులు మద్యం పార్టీ చేసుకుంటున్న సమయంలో.. అటుగా వచ్చిన కుక్క పిల్లకు గ్లాసులో మద్యం పోశారు.
అయితే ఆ కుక్క పిల్ల మద్యం తాగి.. మత్తుతో తూలుతూ కిందపడిపోయింది. ఇదంతా వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన రష్మీ చలించిపోయింది. కుక్కపిల్లకు మద్యం పోసిన వారు ఎవరో వారిని కనిపెట్టాలనీ.. వారితో ఈ వీడియోను కామెడీ చేస్తున్న వారిని కూడా అరెస్ట్ చేయాలని ట్విట్టర్ వేదికా రష్మీ (Rashmi Gowtham) ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం రష్మీ ట్వీట్ సైతం వైరల్‌గా మారింది. మూగ జీవాల సంరక్షణ కోసం తన వంతు సాయం చేస్తున్న రష్మీను నెటిజన్లు అభినందిస్తున్నారు.
Who are these people can someone find the source every person finding this post funny should be arrested https://t.co/Z0Djz9vX0L
— rashmi gautam (@rashmigautam27) November 19, 2022