అపార్ట్‌ మెంట్‌ లో భారీ అగ్నిప్రమాదం.. 58 మంది దుర్మరణం

-

దక్షిణాఫ్రికా(South Africa)లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జోహెన్స్‌ బర్గ్‌ లోని ఓ అపార్ట్‌ మెంట్‌లో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా 58 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 43 మంది గాయపడినట్లు అత్యవసర సేవల ప్రతినిధి రాబర్ట్‌ ములౌద్జీ వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటివరకు 52 మృతదేహాలను వెలికితీశామని చెప్పారు. మంటలు అదుపులోకి వచ్చాయని, అయితే భవనమంతా దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకునే అవకాశం ఉందని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ భవనంలో ఎంతమంది నివసిస్తున్నారనే అంశంపై కూడా స్పష్టత లేదని అన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...