Italy boat accident | ఇటలీలో ఆదివారం ఘోర పడవ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 59కి చేరింది. ఇవాళ మరో 19 మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న ఉదయం దక్షిణ కలాబ్రియా రీజియన్లో బండరాయిని ఢీకొని పడవ మునిగిపోయింది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 200 మంది ఉన్నారు. వారిలో 59 మంది మరణించగా, 81 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఆఫ్గనిస్తాన్, ఇరాన్ దేశాలకు చెందిన వలసదారులు పడవలో యూరప్కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.