Fuel Tanker Blast | మనిషి ఆత్యాశ పలు అనార్థాలకు దారి తీస్తూ ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఆఫ్రికా(Africa) దేశంలో జరిగింది. లైబీరియా(Liberia) దేశంలో రోడ్డుపై వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అవుతుండటం చూసిన స్థానికులు పెట్రోల్ కోసం ఎగబడ్డారు. ప్రమాదం అని తెలిసినా బాటిల్స్, క్యాన్లలో పట్టుకునేందుకు క్యూ కట్టారు. ఇంకేముంది ట్యాంకర్ ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.
Fuel Tanker Blast | ఈ ఘటనలో 40 మంది అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. మరో 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. లైబీరియాలోని టొటోటా పట్టణం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. బోల్తా పడిన ఇంధన ట్యాంకర్ల సమీపంలోకి వెళ్లకూడదని ఎన్ని సార్లు హెచ్చరించినా ప్రజలు వినడం లేదని.. పెట్రోల్ కోసం ఆశతో వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారని అధికారులు చెబుతున్నారు.
The moment a fallen petrol tanker exploded in Liberia pic.twitter.com/GnFqr82sVQ
— Leon H. Usigbe, Ph.D. (@Leehabby) December 28, 2023
Read Also: ‘కుర్చీ మడతపతపెట్టి’ అంటూ స్టెప్పులు ఇరగదీసిన మహేశ్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat