మొరాకోలో భారీ భూకంపం.. 632 మంది మృతి

-

మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపంలో 700లకు పైగా మరణించినట్లు సమాచారం. అనేకమంది గాయపడినట్టు తెలుస్తోంది. టూరిస్ట్ప్రాంతం మర్రకేశ్లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇతర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. భూకంపం ధాటికి అనేక భవనాలు కదిలిపోయాయి. ఇంకొన్ని నేలమట్టం అయ్యాయి. భయంతో ప్రజలు బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి. మొరాకో భూకంపంలో మృతుల సంఖ్య 632గా అధికారులు వెల్లడించారు. మరో 329మంది గాయపడ్డారని వివరించారు. వీరిలో 51మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. భూకంపం అనంతరం పరిణామాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. బాధితులకు సాయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. కాగా.. దేశంలో అతి భయానక భూకంపంగా ఇది నిలిచిపోతుందని స్థానిక మీడియా వెల్లడించింది.

- Advertisement -

భూకంపం కేంద్రం సమీపంలో చాలా ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. చేరుకోవడానికి కష్టంగా ఉన్న పర్వత ప్రాంతాల్లోనే అత్యధిక మరణాలు నమోదయ్యాయని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. ధ్వంసమైన బల్డింగ్ లు శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు సమాచారం. పలువురు తీవ్రగాయాలతో బయటపడ్డారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిన సమీప హాస్పిటల్స్ కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

భూకంపం సంభవించిన సమయంలో అనేక మంది ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీస్తున్న దృశ్యాలు, భయంభయంగా రాత్రంతా రోడ్లపైనే గడిపిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎక్కడ చూసినా కూలిపోయిన భవనాలు, శిథిలాలతో నిండిన వీధులు కనిపిస్తున్నాయి. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశముందన్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోకి వెళ్లకుండా రోడ్లపైనే ఉంటున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...