పాకిస్తాన్‌లో ఘోరం.. పదిమంది పోలీసు అధికారులు మృతి

-

Pakistan |ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్‌లో ఘోరం జరిగింది. కాచీ జిల్లాలోని ప్రధాన పట్టణం ధాదర్ సమీపంలో పోలీసులు వెళ్తోన్న ట్రక్కుపై సోమవారం దాడి జరిగింది. ఈ దాడిలో పదిమంది పోలీసు అధికారులు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. బలూచిస్థాన్‌లోని మిలిటెంట్లు ప్రావిన్స్ సంపదలో పెద్ద మొత్తంలో వాటా డిమాండ్ చేస్తూ.. పాకిస్తాన్ తాలిబాన్ (టీటీపీ) దాడులతో భద్రతా దళాలు సంవత్సరాల తరబడి తిరుగుబాటుతో పోరాడుతున్న విషయం తెలిసిందే. రోడ్డుపై తలక్రిందులుగా ఉన్న పోలీసు ట్రక్కు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దాడిపై కచ్చి జిల్లాకు చెందిన పోలీసు చీఫ్ మెహమూద్ నోట్‌జాయ్ మాట్లాడుతూ.. అధికారులు పశువుల ప్రదర్శన నుండి తిరిగి వస్తున్నారని, అక్కడ వారు భద్రతను అందిస్తున్నారని చెప్పారు. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారో ఇంకా వివరాలు తెలియరాలేదని అన్నారు. 2021 ఆగస్టులో ఆఫ్ఘన్ తాలిబాన్ కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి పాకిస్తాన్‌లో దాడులు పెరుగుతున్నాయన్నారు. సరిహద్దు వెంబడి భద్రతా దళాలను ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్న మిలిటెంట్ గ్రూపులు ఈ దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. attack on police in pakistan

- Advertisement -
Read Also: దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ కీలక పిలపు

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kingfisher Beer Supply | కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ షాక్

Kingfisher Beer Supply | తెలంగాణలోని కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ...

Bhupalpally | పురుగుల మందు తాగి జేసీబీ కిందపడ్డ రైతులు

తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ భూములు లాక్కుంటున్నారని కొంతమంది రైతులు...