ఆస్ట్రేలియా(Australia) దేశానికి చెందిన ఓ మహిళా ఎంపీ తోటి ఎంపీపై సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్‌లోనే తాను లైంగిక వేధింపులను(Sexual Harassment) ఎదుర్కొన్నానని స్వతంత్ర ఎంపీ లిడియా థోర్ఫ్ ఆవేదన వ్యక్తంచేశారు. తనతో పాటు తోటి మహిళా ఎంపీలకు పార్లమెంట్ సురక్షితంగా లేదని కన్నీటిపర్యంతమయ్యారు. సెనేటర్ డేవిడ్ వాన్ తనపై అసభ్యంగా కామెంట్లు చేశారని, అభ్యంతరకరంగా శరీరాన్ని తాకారని ఆమె ఆరోపించారు. అయితే ఆమె వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఈ ఆరోపణలతో వాన్‌ను లిబరల్ పార్టీ సస్పెండ్ చేసింది. కాగా 2021 నుంచి ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో(Australia Parliament) వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2019లో విపరీతంగా మద్యం సేవించిన క్యాబినెట్ మంత్రి పార్లమెంటరీ కార్యాలయంలో తనపై అత్యాచారం చేశారని మాజీ రాజకీయ సలహాదారు బ్రిటనీ హిగ్గిన్స్ ఆరోపించారు. ఈ లైంగిక ఆరోపణలు ఆ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
పార్లమెంట్‌లోనే రక్షణ లేకపోతే ఎలా.. ఆస్ట్రేలియా మహిళా ఎంపీ కంటతడి
-