జెసిండా స్థానంలో న్యూజిలాండ్ నూతన ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్

-

Chris Hipkins To Become New Zealand Prime Minister Replacing Jacinda Ardern: జెసిండా స్థానంలో న్యూజిలాండ్ నూతన ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ పేరును ఖరారు చేశారు. జెసిండా షాకింగ్ నిర్ణయం తర్వాత 48 గంటల్లోనే ఆమె స్థానంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న క్రిస్ కు బాధ్యతలు అప్పగించేందుకు సభ్యులు మొగ్గు చూపినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అధికారికంగా ఆదివారం నుంచి బాధ్యతలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నాయి. కరోనా సమయంలో సంబంధిత మంత్రిగా వ్యవహరిస్తూ క్రిస్ అందరి మన్ననలు పొందారు.

- Advertisement -

కరోనా వైరస్ నియంత్రణలో ఆంక్షలు కఠినంగా అమలు చేశారు. క్రిస్ నిర్ణయాత్మక వ్యక్తి అని, బలమైన ప్రధానిగా కూడా వ్యవహరించే అవకాశం ఉందని లేబర్ పార్టీ ఎంపీలు అన్నారు. వాస్తవానికి పోలీసు అయిన క్రిస్ 2008లో ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మంత్రులకు సలహాదారుగా వ్యవహరిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. తనను 41వ ప్రధానమంత్రి(New Zealand Prime Minister)గా నియమించడంపై స్పందిస్తూ అన్ని పనులు జరిగేలా చూస్తానని క్రిస్ ప్రతిజ్ఞ చేశారు. సమయానికి కావాల్సిన నేత అని జెసిండాపై ప్రశంసల వర్షం కురిపించారు. కొత్త పదవి పట్ల ఉత్సుకతతో ఎదురుచూస్తున్నానని చెప్పారు. మరోవైపు ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జెసిండా స్థానంలో క్రిస్ ఎంపిక ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...