Disney Hotstar | గత రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి ఎంతటి బీభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనిషికి మనిషికి సంబంధం లేకుండా జీవించి చిత్రహింసలు అనుభవించారు. ఈ క్రమంలోనే మనిషి జీవన విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ పాటించడం అలవాటు కావడంతో సినిమా లవర్స్ థియేటర్స్‌కు వెళ్లడం తగ్గించి, ఓటీటీకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఓటీటీ సంస్థలకు బాగా డిమాండ్ పెరిగింది. కరోనా సమయంలో బాగా ఆఫర్లు ప్రకటించిన ఈ సంస్థలు ప్రస్తుతం వరుస షాక్‌లు ఇస్తున్నాయి.
తాజాగా.. ప్రముఖ దిగ్గజ సంస్థ అయిన డిస్నీ+ హాట్ స్టార్(Disney Hotstar) అనూహ్య షాకిచ్చింది. నెట్ ఫ్లిక్స్ దారిలో వెళ్లాలని ఫిక్స్ అయింది. పాస్‌వర్డ్ షేరింగ్‌కు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నది. ఒకే అకౌంట్ ద్వారా పలువురు తమ సేవలను వినియోగించుకోవడం వల్ల OTT ప్లాట్ ఫారమ్స్ రెవెన్యూ నష్టపోవాల్సి వస్తోంది. దీనిని నివారించేందుకు స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌పై ఇటీవల ఆంక్షలు విధించింది. 100 కంటే ఎక్కువ దేశాల్లో ఈ విధానాన్ని అనుసరిస్తోంది. డిస్నీ+ హాట్ స్టార్ సైతం నెట్ ఫ్లిక్స్ బాటలోనే నడవనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.