ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి విస్తృతంగా మార్పులు చేసిన ఎలన్ మస్క్(Elon Musk) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యూజర్లు తమ కంటెంట్ నుంచి డబ్బు సంపాదించుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో కోసం సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ తీసుకు వస్తున్నామని వెల్లడించారు. సుదీర్ఘ సమాచారం నుంచి ఎక్కువ నిడివి గల వీడియోల వరకు దేనికైనా సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకుని యూజర్లు ఆదాయం ఆర్జించుకోవచ్చని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి మానిటైజ్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చని తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఈ ఆప్షన్ అమెరికాలోనే అందుబాటులో ఉండగా త్వరలో ఇతర దేశాలకు విస్తరించబోతున్నట్లు ప్రకటించారు.
Read Also: లోకేశ్ పాదయాత్రపై జేసీ ప్రభాకర్ రెడ్డి కంటతడి
Follow us on: Google News, Koo, Twitter