Twitter Logo |ట్విట్టర్ యూజర్లకు మరో షాక్ ఇచ్చాడు సంస్థ అధినేత ఎలాన్ మస్క్. ట్విట్టర్ లోగో బ్లూ బర్డ్ ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దాని స్థానంలో క్రిప్టోకరెన్సీ అయిన డోజీకాయిన్ కు సంబంధించిన డోజీ మీమ్ ను తీసుకొచ్చాడు. మంగళవారం తెల్లవారుజామను ట్విట్టర్ ఓపెన్ చేసిన యూజర్లు ఈ లోగో చూసి షాక్ అయ్యారు. దీంతో ట్విట్టర్ లోగో మారిందంటూ సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించాడు. ఇక నుంచి బ్లూ బర్డ్ కనపడదని తెలిపాడు. మార్చి 26,2022న ఓ యూజర్ కి ఇచ్చిన మాట ప్రకారం డోజీ లోగోను బ్లూ బర్డ్ స్థానంలో తీసుకొచ్చానని వెల్లడించాడు. అయితే ఈ లోగో(Twitter Logo) శాశ్వతంగా ఉంటుందో లేదో స్పష్టం చేయలేదు. షిబా ఇనూ అనే జపాన్ జాతి కుక్కనే డోజీ మీమ్ గా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం ప్రంచవ్యాప్తంగా ట్విట్టర్ లోగో హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది.
Read Also: తెలంగాణలో మరో టెన్త్ పేపర్ లీక్ కలకలం?
Follow us on: Google News, Koo, Twitter