12 వేలమంది Google ఉద్యోగులకు సుందర్ పిచాయ్ భారీ షాక్

-

Google layoff: ఐటీ ఉద్యోగుల్లో రెసిషన్ భయం కొనసాగుతూనే ఉంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఎప్పుడు తమ ఉద్యోగాలు ఊడిపోతాయో అనే భయాందోళనలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలు తమ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే మైక్రోసాప్ట్, మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిన విషయం తెలిసిందే. ఇక అదే బాటలో ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ గూగుల్ కూడా వెళ్లనుంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది.

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు నిర్ణయం తీసుకున్నట్టు శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు సదరు ఉద్యోగులకు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ సందేశంతో కూడిన ఈమెయిల్ పంపించారు. ఈ చర్య వల్ల అమెరికాలోని గూగుల్ సిబ్బందిపై ఎక్కువ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలోని ఉద్యోగులకు 60 రోజుల పూర్తి నోటిఫికేషన్ కాలానికి వేతనం చెల్లిస్తామని సుందర్ పిచాయ్ ఈమెయిల్ ద్వారా తెలిపారు. పరిహార ప్యాకేజీ కింద 16 వారాల వేతనంతో పాటు గూగుల్ లో పని చేసిన కాలానికి గాను ఏడాదికి రెండు వారాల చొప్పున వేతనం చెల్లిస్తామని తెలిపారు. గూగుల్ తీసుకున్న తాజా నిర్ణయంతో రిక్రూటింగ్, కార్పొరేట్ కార్యాకలాపాలు, ఇంజనీరింగ్, ప్రొడక్ట్స్ టీమ్ కు చెందిన విభాగాల ఉద్యోగాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...