ఆస్ట్రేలియాలోని సిడ్నీ(Sydney) నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సర్సీ హిల్స్‌లోని ఏడంతస్తుల భవనంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం ధాటికి భవనం పూర్తిగా కుప్పకూలింది. తొలుత మూడో అంతస్తులో మొదలైన మంటలు క్షణాల్లోనే భవనమంతా వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు భారీగా ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుదుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. దాదాపు 100 అగ్నిమాపక సిబ్బంది 20 యంత్రాలతో మంటలను అదుపుచేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమీప భవనాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. కాగా అగ్నిప్రమాదం జరిగిన భవనంలో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు.
The moment a chunk of wall falls from the building burning near Sydney’s central station @smh @sarah_keoghan pic.twitter.com/xtcwM6vjwJ
— Angus Thomson (@angusthomson_) May 25, 2023
Read Also:
1. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గైర్హాజరు, హాజరయ్యే పార్టీలు ఏవంటే?
2. పరగడుపునే మెంతి నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలివే
Follow us on: Google News, Koo, Twitter