కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. కేవలం ఆ వైరస్ పుట్టిన చైనానే కాకుండ ప్రపంచ దేశాలను కంటిమీద కునుకులేకుండా చేసింది. కొన్ని కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. మరికొన్ని కుటుంబాలను రోడ్డున పడేసింది. ఈ మహమ్మారి సృష్టించిన దారుణాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరో చేదు వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా దీనికి మరో కొత్త సబ్ వేరియంట్(New Covid Variant) వచ్చింది. దీంతో పలు దేశాలు భయందోళనలో ఉన్నాయి.
ఈ వైరస్(New Covid Variant) బ్రిటన్‌లో పుట్టినట్లు కనుగొన్నారు. ఇప్పుడి వేరియంట్ కేవలం బ్రిటన్‌నే కాకుండా ప్రపంచ దేశాలను వణికిస్తుంది. జూలై 3న బ్రిటన్‌లో ఎరిస్ వేరియంట్‌ను మొదటి కేసుగా గుర్తించారు. ప్రస్తుతం బ్రిటన్‌లో వేగంగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వారం రోజుల్లోనే 8 వేల మంది ఆస్పత్రుల్లో చేరారని బ్రిటన్ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి.