Pepperfry CEO | గుండెపోటుతో ‘పెప్పర్ ఫ్రై’ సీఈవో మృతి

-

ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు ఎక్కువైపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీ వరకు ఎవరినీ హర్ట్‌స్ట్రోక్స్ వదలడం లేదు. మారిన ఆహారపు అలవాట్లో, కరోనా వ్యాక్సిన్ సైడ్‌ ఎఫెక్ట్స్‌నో మొత్తానికి గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోతుంది. తాజాగా ప్రముఖ ఫర్నిచర్ సంస్థ ‘పెప్పర్ ఫ్రై’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో(Pepperfry CEO) అంబీరీశ్ మూర్తి కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయారు. విహారయాత్రలంటే ఇష్టపడే అంబరీశ్.. ఇటీవల మోటార్ సైకిల్‌పై ముంబై నుంచి లడాఖ్‌లోని లేహ్‌ టూర్‌‌కు వెళ్లారు. అయితే లేహ్‌లో సోమవారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

- Advertisement -

“నా స్నేహితుడు, సోదరుడు, సహచరుడు, గురువు అంబరీశ్ మూర్తి ఇక లేరు అని తెలియజేయడానికి బాధపడుతున్నా. సోమవారం రాత్రి లేహ్ వద్ద గుండెపోటుతో ఆయన చనిపోయారు. దయచేసి అంబరీశ్ కోసం, ఆయన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించండి” అని పెప్పర్ ఫ్రై మరో సహ వ్యవస్థాపకుడు ఆశిశ్ షా ట్వీట్ చేశారు. అంబరీశ్ మరణ వార్త తెలుసుకున్న ప్రముఖులు, కంపెనీ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

2012లో అంబరీశ్, ఆశిశ్ కలిసి పెప్పర్ ఫ్రై కంపెనీని స్థాపించారు. బైక్ ప్రయాణాలంటే ఇష్టపడే అంబరీశ్(Pepperfry CEO).. తరచూ ముంబై నుంచి లేహ్‌కు బైక్‌పై వెళ్తుంటారు. ఈ క్రమంలోనే లేహ్‌కు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుతో మృతిచెందారు.

Read Also: బాబాయ్ జయంతి గుర్తుండదు కానీ వర్ధంతి మాత్రం బాగా గుర్తుటుంది: లోకేష్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మహాసేన రాజేష్ యూటర్న్.. జనసేనను ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు..

ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి...

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై అల్లుడు మరో వీడియో

ఏపీ ఎన్నికలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబు(Ambati...