Biden:ప్రమాదరకర దేశాల్లో పాకిస్తాన్ ప్రధానమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. లాస్ ఏంజిల్స్ కాలిఫోర్నియాలో జరిగిన డెమొక్రాటిక్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ రిసెప్షన్‌లో బైడెన్ (Biden) మాట్లాడారు. పాక్ విషయంలో బైడెన్ (Biden) చేసిన వ్యాఖ్యలు నూతన ప్రధాని షెహబజ్ షరీఫ్‌కు కొత్త తంటాలు తీసుకొచ్చే అవకాశం లేక పోలేదు.అణ్వాయుధాల విషయంలో రష్యా, చైనాలు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. విదేశాంగ విధానాలలో చైనా, రష్యాల వైఖరి పై మండిపడ్డారు. యూఎస్ జాతీయ భద్రతా వ్యుహంపై 48 పేజీల డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. అయితే 21వ శతాబ్దంలో అమెరికా శక్తివంతంగా మారేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. వచ్చే పదేళ్లు చైనాతో పోటీ నిర్ణయాత్మక దశాబ్దం కానుందని అమెరికా భద్రతా వ్యూహం తెలిపింది.