భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అమెరికా పర్యటనకు షెడ్యూల్ ఫిక్సయింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆయన US లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక ప్రసంగం ఇవ్వనున్నారు. గతంలో ట్రంప్ హయాంలో మోదీ ప్రసంగించారు. ఇలా అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి రెండోసారి ప్రసంగించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలపై ఆయన స్పీచ్ లో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం.