Maldives | మాల్దీవులకు మోదీ చెక్.. అసలు ఏం జరిగిందంటే?

-

Maldives-Lakshadweep | ప్రధాని మోదీ(PM Modi) లక్షద్వీప్ పర్యటనతో ఆ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. ఆ కేంద్రపాలిత ప్రాంతం నుంచి అన్వేషించే వాళ్లు అమాంతం పెరిగిపోయారు. పర్యాటక రంగంలో మాల్దీవుల దేశానికి వ్యతిరేకంగా లక్షద్వీప్‌ను ప్రమోట్ చేసేలా మోదీ దిగిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ నేతల్లో కలవరం మొదలైంది. దీంతో భారత్‌తో పాటు మోదీపైనా తీవ్ర అక్కసు వెళ్లగక్కుతూ ట్వీట్లు చేశారు. వారి తీరుతో హర్ట్ అయిన భారతీయులు బాయ్ కాట్ మాల్దీవులు నినాదం ఎత్తుకున్నారు.

- Advertisement -

బాయ్‌కాట్ మాల్దీవులు నినాదం..

మరోవైపు మాల్దీవుల(Maldives) మంత్రుల వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. మాల్దీవుల పర్యటనను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. దీంతో అక్కడి పర్యాటక రంగానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం దిగొచ్చింది. భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. అయినా కానీ చల్లారని భారత్ ప్రభుత్వం మాత్రం ఆ దేశ రాయబారికి నోటీసులు జారీ చేసింది.

లక్షద్వీప్ పట్ల ప్రజల ఆసక్తి..

ఇదిలా ఉంటే ఈ వ్యవహారం మాల్దీవుల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కేవలం రెండు రోజుల్లో ఆ దేశంలో హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్లు పెద్ద మొత్తంలో రద్దయ్యాయి. అలాగే లక్షద్వీప్‌ గురించి ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ మేక్‌ మైట్రిప్‌లో వెతికే వారి సంఖ్య ఏకంగా 3,400 శాతం పెరిగింది. అక్కడికి వెళ్లేందుకు ప్రజలు చాలా ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొంది.

చైనా అండతో రెచ్చిపోతుంది..

కేవలం ఐదు లక్షల జనాభా ఉన్న మాల్దీవులకు(Maldives) తొలి నుంచి భారత్ అండగా ఉంటూ వస్తోంది. అయితే చైనా ఎంట్రీతో భారత్‌తో మాల్దీవుల దేశం సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్‌ను దెబ్బతీసేందుకు పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలను ఆర్థికంగా ఆశ చూపించి తన వైపు తిప్పుకుంటుంది. తాజాగా మాల్దీవులకు కూడా ఎరవేసింది. ఈ క్రమంలోనే గతేడాది భారత్‌ వ్యతిరేకి అయిన మహ్మద్ మయిజ్జూ నేతృత్వంలోని ప్రభుత్వం అక్కడ ఏర్పాటైంది. అప్పటి నుంచి మన దేశంపై తమ అక్కసు వ్యక్తపరుస్తూనే ఉన్నారు.

స్వయంగా రంగంలోకి ప్రధాని మోదీ..

అందుకే వారికి చెక్ పెట్టేందుకు స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. ఆ దేశ ప్రధాన ఆదాయమైన పర్యాటక రంగాన్ని దెబ్బ కొట్టాలని సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా లక్షద్వీప్‌లో పర్యటించిన భారత పర్యాటకులను ఇక్కడికి రావాల్సిందిగా ప్రోత్సహించారు. దీంతో భారత్ పర్యాటక ప్రదేశాలపై ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఇటు దేశ పర్యాటక రంగం పెరిగి ఆదాయం సమకూరడంతో పాటు మాల్దీవుల వంటి పర్యాటక దేశాలకు చెక్ పెట్టేలా మోదీ వ్యవహరించండపై ప్రశంసలు లభిస్తున్నాయి.

Read Also: ఐరన్ అధికంగా ఉండే పళ్ళు ఇవే
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...