Tanishq opens first retail showroom in the US: టాటా గ్రూప్స్ కి చెందిన జ్యువెలరీ బ్రాండ్ తనిష్క్ అమెరికన్ మార్కెట్లోకి ఎంటరైంది. న్యూజెర్సీలో మినీ ఇండియాగా పేరున్న ఓక్ ట్రీ రోడ్ ప్రాంతంలో ఫస్ట్ స్టోర్‌ను ప్రారంభించింది. ఇప్పటికే అక్కడ భారత సంతతికి చెందినవారు పదికి పైగా ఆభరణాల స్టోర్లను నిర్వహిస్తున్నారు. తనిష్క్ ప్రారంభించిన ఈ స్టోర్‌లో 6,500 కంటే ఎక్కువ డిజైన్లతో కూడిన ఆభరణాలు అందుబాటులో ఉంటాయని తనిష్క్ ప్రతినిధులు తెలిపారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా బంగారం, వజ్రాలు, పగడాలు, ఇతర విలువైన రాళ్లతో వీటి తయారీ చేసినట్టు వెల్లడించారు. అమెరికాలో ఉన్న భారతీయుల కోసం వీటిని రూపొందించామని పేర్కొన్నారు.
అయితే ఇప్పటికే అమెరికాలో ఈ-కామర్స్ ద్వారా అమ్మకాలు ప్రారంభించిన కంపెనీ ఇప్పుడు నేరుగా రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. రానున్న రెండు మూడేళ్లలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని, కనీసం 20-30 కొత్త స్టోర్లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు తనిష్క్(Tanishq) ఓ ప్రకటనలో వెల్లడించినిద్. కాగా, ప్రస్తుతానికి కంపెనీ భారత్‌లో 400కు పైగా రిటైల్ స్టోర్లను కలిగి ఉంది. వచ్చే ఏడాది కాలంలో మరో 100 స్టోర్లను తెరవనున్నట్టు తనిష్క్ మాతృసంస్థ టైటాన్ ఎండీ వెంకటరామన్ పేర్కొన్నారు.