Three dead and several injured after a gun man opens fire in Central Paris : సెంట్రల్ ప్యారిస్‌లో ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. 69 ఏళ్ల వృద్ధుడు శుక్రవారం మధ్నాహ్న సమయంలో కుర్దీశ్ కల్చర్ సెంటర్ వద్ద కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారని సిటీ అధికారులు తెలిపారు. మరి కొందరు గాయపడినట్లు పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలోనూ అతడు హత్యయత్నాలకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. నిందితుడి ఉద్దేశం ఏంటో స్పష్టత లేదని, అయితే జాతిపరమైన వివక్షతో దాడికి పాల్పడినట్లు ఘటనను చూస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించామని అధికారులు తెలిపారు.
Gun Fire in Central Paris: ప్యారిస్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి
-