ఇండోనేషియా(Indonesia)లో భారీ భూకంపం సంభవించింది. సుమత్రా ద్వీపానికి పశ్చిమ తీరంలో రిక్టర్ స్కేలుపై 7.3తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ సునామీ హెచ్చరికలు జారీచేసింది. సునామీ హెచ్చరికలతో సుమత్రా తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని.. ప్రజలు బీచులకు రావొద్దని హెచ్చరించింది. ఇప్పటికే చాలా మంది ప్రజలు సముద్రానికి దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. కాగా గంతోనూ 6.9తీవ్రతతో ఇండోనేషియాలో భూకంపం వచ్చింది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలిచే భూకంప జోన్ అయిన ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి.
- Advertisement -
Read Also: SRH హాట్రిక్ ఓటమి.. ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
Follow us on: Google News, Koo, Twitter