International Yoga Day |అంతర్జాతీయ యోగా దినోత్సవం… నరేంద్ర మోదీ పాత్ర ఏంటి?

-

International Yoga Day |ప్రపంచవ్యాప్తంగా చాలామంది జీవన శైలిలో భాగంగా మారిపోయింది యోగా. ఆసనాలు, శ్వాస పద్ధతులు, ధ్యానం కలగలిపిన ప్రక్రియ లా యోగా ఉంటుంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభ్యాసంగా పేర్కొనే ఈ యోగా మన దేశంలోనే ఉద్భవించింది. ప్రతిరోజూ యోగా చేయడం వలన మనస్సు, శరీరం, ఆత్మ మధ్య బ్యాలెన్స్ ఏర్పడుతుంది. ఆలోచనలు కంట్రోల్ లో ఉంటాయి.

- Advertisement -

ప్రతి ఏటా జూన్ 21వ తేదీన ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటారు. సెప్టెంబరు 27, 2014న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ప్రసంగిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day)గా గుర్తించాలని ఆయన సూచించారు.

ఈ ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితిలోని సభ్య దేశాల నుండి మద్దతు లభించింది. దీంతో డిసెంబర్ 11, 2014న తీర్మానానికి ఆమోదం లభించింది. తీర్మానం శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా అందించే సంపూర్ణ ప్రయోజనాలను గుర్తించింది. సమతుల్య జీవనశైలిని ప్రోత్సహించడంలో దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21, 2015న జరుపుకున్నారు. అప్పటి నుండి, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏటా జూన్ 21న జరుపుకుంటారు.

Read Also:
1. మెదడు పనితీరు తోపాటు ఎన్నో ప్రయోజనాలిచ్చే జ్ఞాన ముద్ర
2. అపాన ముద్రతో ఆ సమస్యలన్నింటికీ చెక్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...