యూట్యూబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. స్టోరిస్ ఫీచర్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 26 నుంచి స్టోరీస్(Youtube Stories) ఫీచర్‌ను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఈ స్టోరిస్ ఫీచర్‌ను యూట్యూబ్ 2017లో పరిచయం చేసింది. 10,000 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న వినియోగదారులకు స్టోరీస్ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు వంటి ఇతర ఫీచర్లపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈజీ అప్‌డేట్ షేరింగ్, కంటెంట్ ప్రచారం వంటి వాటికి ప్రత్యామ్నాయంగా కమ్యూనిటీ పోస్ట్‌లను ప్రోత్సహించాలని యూట్యూబ్ భావిస్తోంది. ఇందుకు యూట్యూబ్ షార్ట్స్, కమ్యూనిటీ పోస్ట్, లైవ్ వీడియాలు బెస్ట్ అని అనుకుంటోంది.
Read Also:
1. కోజీకోడ్‌లో దారుణం.. కాల్వలో యువకుడి శరీర భాగాలు
2. మహేశ్ మాస్ స్ట్రైక్.. రెడీగా ఉండండి ఫ్యాన్స్
Follow us on: Google News, Koo, Twitter