మహేష్ బాబు మహర్షి రివ్యూ..!!

మహేష్ బాబు మహర్షి రివ్యూ..!!

0
58

నటీనటులు : మహేష్‌ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్‌, జగపతి బాబు, ప్రకాష్ రాజ్‌
దర్శకత్వం : వంశీ పైడిపల్లి
నిర్మాత : దిల్‌ రాజు, అశ్వినీదత్‌, పీవీపీ
మ్యూజిక్ : దేవిశ్రీ ప్రసాద్‌
విడుదల తేదీ : మే 9 2019

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కిన మూవీ మహర్షి. మహేష్ కెరీర్‌లో మైల్‌ స్టోన్ మూవీ కావటంతో దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీ లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా నేడే విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఈమేరకు మెప్పించిందో చూద్దాం..

కథ :

తాను అనుకున్నది సాధించేందుకు ఎంత వరకు అయినా వెళ్లే తత్వం కలిగి ఉండే వ్యక్తి రిషి(మహేష్‌ బాబు). కాలేజ్‌ కుర్రాడిగా ఉన్న సమయంలో అతడు ఎదుర్కొన్న సంఘర్షణల నుండి ఒక ప్రపంచ స్థాయి కార్పోరేట్‌ కంపెనీకి అధినేత ఎలా ఎదిగాడు, అందుకు ప్రేరేపించిన కారణాలు ఏంటీ అనేది ఈ చిత్రం కథగా చెప్పుకోవచ్చు. వేల కోట్లు సంపాదించిన రిషి వెనక్కు తిరిగి చూసుకుంటే జీవితంలో ఎన్నో మిస్‌ అవుతాడు.

వాటిని మళ్లీ దక్కించుకునేందుకు తన స్నేహితుడి(అల్లరి నరేష్‌) ఊరు అయిన ఒక పల్లెటూరుకు వస్తాడు. అక్కడ అతడు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ అనేది సినిమాను చూసి తెలుసుకోంది. ఇదో విభిన్నమైన కథ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.

నటీనటులు :

ఈ సినిమా లో మహేష్ నటన హైలైట్..సీఈవో గా, స్టూడెంట్ గా, రైతు గా మహేష్ వేరియేషన్స్ చూపించాడు. నటుడుగా ప్రత్యేకంగా మాట్లాడుకునే స్దాయి ఎప్పుడో దాటేసారు. స్టూడెంట్ గా సూపర్ ఈజ్ తో తన ఏజ్ ని గమనించనివ్వకుండా చేయటం అంటే మామూలు విషయం కాదు. కామెడీ సినిమాలు చేసుకునే అల్లరి నరేష్ తన రూట్ మార్చి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఈ సినిమాలో చేసిన నటన అద్భుతం.. హీరోయిన్‌ పూజా హెగ్డే తన పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. లుక్‌ పరంగా మంచి మార్కులు సాధించారు. విలన్‌ జగపతిబాబు మరోసారి స్టైలిష్‌ లుక్‌లో మెప్పించాడు. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్‌, జయసుధ, సాయి కుమార్‌, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్‌ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం :

మహర్షిలో ఇంత డెప్త్ ఊహించలేదు. వంశీ పైడిపల్లి అందించిన స్టోరీ మహేష్ బాబుకు ఓవర్ షాడోలా ఉంది. వండర్ ఫుల్ మూవీ. ఒక డైరెక్టర్ కథను నమ్మి తీసిన మూవీ మహర్షి. సినిమాలోని ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా అద్భుతం అనేలా ఉంది. కథనం విషయంలోనూ దర్శకుడు కాస్త తడబడ్డాడు. సుదీర్ఘంగా సాగే నేరేషన్‌ అక్కడక్కడా బోర్‌ ఫీలింగ్ కలిగిస్తుంది. అయితే సూపర్‌ స్టార్‌ అభిమానులను మాత్రం వంశీ పూర్తి స్థాయిలో అలరించాడు. మహేష్‌లోని హీరోయిజం, ఎమోషనల్‌ యాక్టింగ్‌, కామెడీ టైమింగ్‌ ఇలా అన్నింటిని వెండితెర మీద ఆవిష్కరించాడు. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. గత చిత్రాల్లో పాటలు ఎలా ఉన్న నేపథ్య సంగీతంతో మెప్పించే దేవీ ఈ సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ విషయంలోనూ అంచనాలను అందుకోలేకపోయాడు.

ప్లస్ పాయింట్స్

మహేష్ బాబు, అల్లరి నరేష్‌ నటన
ఎమోషనల్ సీన్స్‌
యాక్షన్‌ సీన్స్‌
ఎమోషనల్‌ క్లైమాక్స్‌

మైనస్ పాయింట్స్ :

సినిమా నిడివి
రొటీన్‌ స్టోరీ
అక్కడక్కడా స్లో నేరేషన్‌
సంగీతం

ఫైనల్ గా రైతులు ధియోటర్ కు వచ్చి ఈ సినిమా చూస్తే అసలైన విజయం సాధించినట్లు. అందుకోసం ఏదైనా ఏర్పాటు సినిమా టీమ్ చేస్తే బాగుంటుంది.

రేటింగ్ : 3.5/5