అమ్మ ఒడి 15 వేలు వచ్చిన వారు రూ.1000 ఇస్తున్నారా ఈ విషయాలు తెలుసుకోండి

అమ్మ ఒడి 15 వేలు వచ్చిన వారు రూ.1000 ఇస్తున్నారా ఈ విషయాలు తెలుసుకోండి

0
35

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని ఇటీవల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ..

వచ్చే విద్యాసంవత్సరం ఒకటి నుంచి ఆరోతరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని ప్రకటించారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం మెనూ కూడా తెలిపారు.

అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే రూ.15వేలలో వెయ్యి రూపాయలు పాఠశాలకు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులను సీఎం జగన్ కోరిన విషయం తెలిసిందే. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలకోసం ఆ డబ్బులు ఖర్చుచేస్తామని తెలిపారు. అయితే దీనిపై చాలా వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో నగదు 1000 రూపాయలు ఇస్తున్నారు.మరి ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల్లో వారు మౌలిక సదుపాయాలు కల్పిస్తారు కాబట్టి మేము 1000 రూపాయలు ఇవ్వము అని కొందరు అంటున్నారు.

కాని ఇలా 1000 ఇస్తే స్కూల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు ఇది ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు, ఇది గవర్నమెంట్ స్కూల్ కు కచ్చితంగా

ఇచ్చేలా చూడండి అని చెబుతున్నారు అధికారులు, సీఎం చెప్పారు కాబట్టి మాకు కూడా ఇవ్వాలి అని ప్రైవేట్ స్కూల్ వారు అడుగుతున్నారు, అయితే దీనిపై అధికారులు కూడా అదే చెబుతున్నారు..

కేవలం ప్రభుత్వ స్కూల్ కు మాత్రమే ఇవ్వండి అని చెబుతున్నారు, ప్రైవేట్ స్కూల్ వారికి చెల్లించాల్సిన అవసరం లేదు అంటున్నారు.. మీరు చెల్లించే ఫీజుల్లో ఇది యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఇవ్వవలసిన అవసరం లేదు అంటున్నారు.ఇక జనవరి 19 వరకూ చాలా మందికి ఎలిజిబుల్ లిస్ట్ ప్రకారం నగదు అందుతుంది.. ఆ తర్వాత మీకు అమ్మఒడి నగదు డిపాజిట్ కాకపోతే మీరు అధికారులని సంప్రదించాలి అంటున్నారు.