బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా సునీల్ జోషి

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా సునీల్ జోషి

0

బీసీసీఐ సెలక్షన్ కమిటీ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులు అవుతారా అని ఇప్పటి వరకూ అనేక సందేహాలు ఉండేవి… తాజాగా నూతన చైర్మన్ ఎంపిక జరిగిపోయింది..బీసీసీఐ సెలక్షన్ కమిటీ నూతన చైర్మన్ గా మాజీ స్పిన్నర్ సునీల్ జోషి నియమితులయ్యారు.. అంతేకాదు సెలక్షన్ కమిటీ సభ్యుడిగా మాజీ పేస్ బౌలర్ హర్వీందర్ సింగ్ ఎంపిక అయ్యారు.

సెలక్షన్ కమిటీకి కొత్త చైర్మన్ ఎంపిక విషయమై క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ) ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ లో సీఏసీ సభ్యులు మదన్ లాల్, రుద్ర ప్రతాప్ సింగ్, సులక్షణా నాయక్ లు లో ఈరోజు సమావేశమయ్యారు. తాజాగా ఈ నిర్ణయం తీసుకుని ఫైనల్ ఇంటర్వ్యూ తర్వాత ఈ పేర్లు ప్రకటించారు.

ఇక ఇంటర్వ్యూకి సునీల్ జోషి, మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ ఎల్.ఎస్.శివరామకృష్ణన్, రాజేష్ చౌహాన్, హర్వీందర్ సింగ్ హజరయ్యారు, ఫైనల్ గా వీరిద్దరిని బీసీసీఐ ప్రకటించింది, త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే
సిరీస్ కు సునీల్ కమిటీ ప్లేయర్స్ ని జట్టుని సెలక్ట్ చేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here