ఫోన్ లో కరోనా కాలర్ ట్యూన్ రాకుండా ఉండాలంటే ఈ చిన్న టెక్నిక్ ఫాలో అవ్వండి

ఫోన్ లో కరోనా కాలర్ ట్యూన్ రాకుండా ఉండాలంటే ఈ చిన్న టెక్నిక్ ఫాలో అవ్వండి

0

ఈ ఏడాది చాలా మంది వైద్యులు కూడా కరోనా ఏడాది అంటున్నారు…ఇది ప్రపంచాన్ని వణికించేసింది.. ఎంతో పెద్ద పెద్ద ఔషద కంపెనీలు కూడా దీనిని తగ్గించేందుకు మెడిసన్ కనిపెట్టే పనిలో ఉన్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4 వేల 9కి చేరింది. లక్షా 14 వేల 285 మంది కరోనా బాధితులు ఉన్నారు. 6 వేల 88 మందికి సీరియస్ గా ఉంది. 113 దేశాలకు వైరస్ పాకింది.

ఇక ఎక్కువగా నష్టపోయింది 80 శాతం చైనా అనే చెప్పాలి, ఇక దీనిని నివారించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు..
అంతేకాదు వీలైనంత వరకూ జాగ్రత్తలు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి ఫోన్ చేసినపుడు కరోనా అవగాహన సందేశాన్ని వినిపిస్తున్నాయి.

ఈ మధ్య మూడు రోజుల నుంచి ఎవరికి ఫోన్ చేసినా, ఇదే సందేశాలు వినిపిస్తున్నాయి..మీకు నచ్చిన మీరు మెచ్చిన సాంగ్స్ రావడం లేదు.. ఇలా ఫోన్లో ఆ ఆడియో దాదాపు 30 సెకన్ల పాటు వస్తుంది. ఏ నెట్వర్క్ను మినహాయించకుండా అందరూ ఈ ఆదేశాలను పాటించాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది. అందుకే అందరికి ఇదే కాలర్ ట్యూన్ కరోనా ట్యూన్ గా వస్తోంది. కాని కొందరు ఈ ట్యూన్ వద్దు అంటున్నారు, ఈ కాలర్ ట్యూన్ నుంచి విముక్తి పొందడానికి ఓ టెక్నిక్ ఉపయోగించవచ్చట, సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. మీరు నెంబర్ డయల్ చేసిన సమయంలో కరోనా మెసేజ్ వస్తున్నప్పుడు 1నెంబర్ నొక్కితే కరోనా కాలర్ ట్యూన్ ఆగిపోతుందట. సో ఇలా చాలా మంది ట్రై చేస్తున్నారట.