ఇంట్లో ఇలాంటి శబ్దాలు వస్తే వెంటనే ఇలా చేయండి జాగ్రత్త

ఇంట్లో ఇలాంటి శబ్దాలు వస్తే వెంటనే ఇలా చేయండి జాగ్రత్త

0
45

ఇది వర్షాకాలం చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా పంట పొలాలు తోటల దగ్గర ఇళ్లు నివాసాలు ఉంటాయి, అలాంటి వారు పాముల గురించి జాగ్రత్తగా ఉండాలి, ఈ సమయంలో పాములు గుడ్లు కూడా పెట్టేస్తాయి, అవి పిల్లలు అవుతాయి కాని వాటి గురించి అంతగా తెలియదు.

చాలా మంది చెత్త చెదారాలు మొక్కలు ఉన్న చోట పట్టించుకోరు, కాని అక్కడ చల్లగా ఉంటుంది అని పాములు అక్కడ ఇలా గుడ్లు పెడతాయి, అక్కడ శబ్దాలు వస్తున్నా ఏదైనా వాసన వస్తున్నా వెంటనే పరిశీలించండి. పాము గుడ్డు పెడితే అక్కడ శబ్దాలు బుస్ మనే శబ్దాలు వస్తాయి.

ఇటీవల కోలియంలో ఓ వ్యక్తి ఇంటి గోడ పక్కన కాకర పాదు ఉంది… అతను చూడలేదు కాని అక్కడ శబ్దాలు వచ్చాయి, తీరా ఆ పాదు మొత్తం తీస్తే అక్కడ 40 పాము గుడ్లు ఉన్నాయి, మూడు పెద్ద తాచుపాములు ఉన్నాయి అక్కడ పాము పిల్లలు మరో 20 ఉన్నాయి, అందుకే జాగ్రత్తగా ఉండండి.