రానా – నాని అదిరిపోయే మ‌ల్టీస్టార‌ర్ చిత్రం

రానా - నాని అదిరిపోయే మ‌ల్టీస్టార‌ర్ చిత్రం

0

నేటి త‌రం హీరోలు మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేసేందుకు చాలా ఆస‌క్తి చూపిస్తున్నారు, గ‌తంలో ఇలా సినిమాలు చాలా త‌క్కువ వచ్చేవి, కాని నేటి త‌రం హీరోలు స్నేహాల వ‌ల్ల వారికి క‌ధ న‌చ్చితే మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డానికి సిద్దం అవుతున్నారు.

ఏడాదికి ఐదు నుంచి ఆరు చిత్రాలు ఇలా విడుద‌ల అవుతున్నాయి, తాజాగా తెలుగులో మ‌రో మ‌ల్టీస్టార‌ర్ రెడీ అవ్వ‌నుంది అని వార్త‌లు వినిపిస్తున్నాయి, దగ్గుబాటి రానా, నాని కూడా మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం వుంది.

ఇప్పుడు వీరిద్దరూ కలసి ఓ మల్టీ స్టారర్ లో నటించే సూచనలు కనిపిస్తున్నాయి. వీరిద్దరితోనూ ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి రానా తండ్రి సురేశ్ బాబు ప్లాన్ చేస్తున్నార‌ని, ఓ ద‌ర్శ‌కుడికి క‌థ బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించారు అని తెలుస్తోంది, యాక్ష‌న్ చిత్రంగా ఇది రాబోతోంద‌ట‌, అన్నీ సెట్ అయితే వ‌చ్చే ఏడాది ప్ర‌ధ‌మార్దంలోనే చిత్రం ప్రారంభం అవ్వ‌చ్చు అంటున్నారు టాలీవుడ్ పెద్ద‌లు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here