లంచ్ ఇలా చేస్తే కాస్త బరువు తగ్గుతారట డైట్ ప్లాన్

లంచ్ ఇలా చేస్తే కాస్త బరువు తగ్గుతారట డైట్ ప్లాన్

0
32

చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేసి మధ్యాహ్నం భోజనం ఎక్కువ తీసుకుంటారు.. రాత్రి ఫుడ్ మానేసి జ్యూస్ తాగిపడుకుంటారు ఇలా సరైన డైట్ ఫాలో కాకపోతే మన శరీరానికి మనం చేటు చేసిన వారిమి అవుతాము, అయితే అధిక క్యాలరీ ఫుడ్ తినడం తగ్గించాలి.. ఒకవేళ మనం బాగా కష్టపడి పని చేస్తున్నాము అంటే కాలరీలు ఉండేఫుడ్ తీసుకోవాలి.

అందుకే పనిఎక్కువ చేసేవారు అధిక క్యాలరీ ఫుడ్ తీసుకోవాలి, ముఖ్యంగా లంచ్ అనేది చాలా ముఖ్యం..
అన్ హెల్దీ ఫుడ్ జంక్ ఫుడ్ అస్సలు లంచ్ లో తీసుకోవద్దు, ఎనిమిదికి ముందు బ్రేక్ ఫాస్ట్ చేస్తే కరెక్టుగా 1 నుంచి 2 గంటలలోపు లంచ్ చేయండి.

ఇలా చేస్తే డిన్నర్ లోపు మీరు తిన్న లంచ్ పూర్తిగా అరిగిపోయేందుకు సమయం లభిస్తుంది. పకోడీ, పరాఠా, వెజిటబుల్ కర్రీ, పప్పూ, చోలే మసాలా, పనీర్ భుర్జీ, రాజ్మా మసాలా, జీరా రైస్, రైతా, పులుసుసాంబార్, పెరుగుమజ్జిగ వంటివి మంచి లంచ్ ఆప్షన్స్. నాన్స్ పన్నీరు కూడా మంచిదే, ఏదైనా మితంగా తీసుకోండి, తక్కువగా నాన్ వేజ్ తీసుకోవాలి, ఇక లంచ్ అయ్యాక ఫ్రూట్ జ్యూస్ ఇలాంటివి రెండుగంటల వరకూ తీసుకోవద్దు.