పెళ్లి చూపులు అయ్యాయి – కట్నం వల్ల పెళ్లి కుదరలేదు – కాని ఈ జంట ఏం చేశారంటే

పెళ్లి చూపులు అయ్యాయి - కట్నం వల్ల పెళ్లి కుదరలేదు - కాని ఈ జంట ఏం చేశారంటే

0

పెళ్లి సంబంధాలు చూసిన సమయంలో జాతకాలు కట్నాలు అన్నీసెట్ అయితేనే మూడు ముళ్లు వరకూ వెళతాయి అనేది తెలిసిందే.. ఇక కొందరు కట్నాలు సెట్ అవ్వలేదు అని జాతకాలు కుదరలేదు అని క్యాన్సిల్ చేసుకుంటారు, ఇక మరికొందరు చిన్న చిన్న వివాదాల వల్ల కుదిరిన పెళ్లి కూడా ఆపుకుంటారు, అయితే అమ్మాయికి అబ్బాయికి నచ్చిన తర్వాత ఇలా కట్నాలు జాతకాల కోసం పెళ్లి ఆపుకుంటే ఆ జంట బాధ వర్ణనాతీతం.

 

 

ఇక్కడ ఏం జరిగింది అంటే అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ కట్నం విషయంలోనే పెద్దల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి… చివరకు పెళ్లి వద్దు అనుకున్నారు, అయితే ఈ జంట మాత్రం ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు తీసుకుని ఫోన్లో మాట్లాడుకునేవారు… చివరకు ఇద్దరూ మాట్లాడుకుని ఇంట్లోంచి ఎస్కేప్ అయ్యారు. చివరకు వీరి పంచాయతీ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.

 

ఇక ఇద్దరు మేజర్లు కావడంతో వారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము అని చెప్పారు.. ఇక ఈ జంట అబ్బాయి ఇంటికి వెళుతున్న సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు 8 మంది వారిని ఆపి ఆమెని తీసుకువెళ్లారు… ఇలా ఎనిమిది మంది ఆమె కుటుంబ సభ్యులు ఆమెని తీసుకువెళ్లడంతో ఆ యువకుడు మళ్లీ పోలీసు స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు , దీంతో వారిని అరెస్ట్ చేసి ఆమెని ఆ యువకుడిని వారి ఇంటిలో అప్పగించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here