ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

-

Alltime Report, Desk: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక ప్రతిపాదనలకు (AP Cabinet Decisions) ఆమోదం తెలిపింది. అలాగే విశాఖలో ఈ నెల 11,12,13 తేదీల్లో జరగనున్న సీఐఐ సమ్మిట్ పైనా మంత్రివర్గం చర్చలు జరిపింది. సమ్మిట్ ద్వారా భారీ పెట్టుబడులు రాబట్టే ప్రణాళికలు, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంపై సమీక్ష నిర్వహించారు. అలాగే చర్చకు వచ్చిన పలు కీలక అంశాలకు మంత్రివర్గం నుంచి ఆమోదం లభించింది. రాంబిల్లిలో రూ.570 కోట్లతో ఈప్యాక్ డేటా సెంటర్ పరికరాల తయారీ సంస్థకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాయుడుపేటలో రూ .4 వేల కోట్లతో కార్బన్ కాస్మో ప్రాజెక్టు, తిరుపతిలో రూ.700 కోట్లతో డిక్సన్ టెక్నాలజీస్ పరిశ్రమ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

- Advertisement -

క్యాబినెట్ ముఖ్య నిర్ణయాలివే (AP Cabinet Decisions)..

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఎప్యాక్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు ఆమోదం.

భోగాపురంలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్‌కు భూమి కేటాయింపు.

భీమిలి ఆమనంలో 512 మెగావాట్ల గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్.

ఏపీ రోబోటిక్స్ అండ్ ఫిజికల్ ఏఐ పాలసీ 2026–36కు ఆమోదం.

యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ పాలసీ 2026–31కు ఆమోదం.

సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0లో సవరణలకు ఆమోదం.

నక్కపల్లిలో హెటెరో గ్రూపునకు 173.82 ఎకరాల భూమి కేటాయింపు.

తిరుపతిలో డిక్సన్ టెక్నాలజీస్‌కు భూమి కేటాయింపునకు ఆమోదం.

జగ్గయ్యపేటలోని జయంతిపురంలో వుమెన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఆమోదం.

విజయవాడలో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 15 మెగావాట్ల ప్లాంట్‌కు ఆమోదం.

తాడిపత్రిలో 119 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుకు భూమి కేటాయింపునకు ఆమోదం.

Also Read : ఇలా చేస్తే వారంలో 5కిలోల బరువు తగ్గేయొచ్చు..!

Follow Us On: X (Twitter)

Read more RELATED
Recommended to you

Latest news

Must read

దోహాలో భారత్ దబడిదిబిడే.. ఒకే రోజు రెండు గోల్డ్ మెడల్స్

Alltime Report, Desk: దోహా వేదికగా జరుగుతున్న ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిల్‌(ISSF...

కవిత నివాసంపై డ్రోన్ కలకలం

Alltime Report, Desk : తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల...