ఏపీలో జరుగుతున్న రాజకీయ చదరంగాలు తెలిసిందే, అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఓటమితో రాజకీయంగా టీడీపీ చరిత్ర అయిపోయింది అని విమర్శలు వస్తున్నాయి.. కాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయంగా కీలక అడుగులు వేయనున్నారు అని తెలుస్తోంది.. అయితే ఏ పార్టీ పై ఆయన పోరాటం చేశారో , అదే పార్టీ అధినేత ప్రధాని నరేంద్రమోదీని ఆయన త్వరలో కలువనున్నారట.
ఏపీలో జరుగుతున్న రాజకీయాలు అలాగే ఇక్కడ రాజధాని అంశం గురించి చర్చించనున్నారని, కేంద్రం సాయం చేయాలని , అలాగే రాజధానిపై ఓ ప్రకటన చేయించాలని, అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఏ కంపెనీలు రాని పరిస్దితి వచ్చిందని, దీనిపై మీరు చొరవ తీసుకోవాలి అని కేంద్రానికి ఆయన చెప్పనున్నట్లు తెలుస్తోంది.,
అయితే చంద్రబాబు రాజకీయ విభేదాలు పక్కన పెట్టి ఏపీ బాగుకోసం ఈ నిర్ణయం తీసుకోనున్నారు అని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత వరకూ వాస్తవమో చూడాలి.