ప్రిన్స్ 25 వ సినిమా టీజర్ కి అదిరిపొయ్యే రెస్పాన్స్

ప్రిన్స్ 25 వ సినిమా టీజర్ కి అదిరిపొయ్యే రెస్పాన్స్

0
112

మహేష్‌ బాబు హీరోగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పివిపి సినిమా నిర్మిస్తున్న ప్రెస్టీజియస్‌ మూవీకి ‘మహర్షి’ నిన్న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పేరు ఖరారు చేసారు.

అలాగే చిత్ర ఫస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ కూడా విడుదల చేసి అభిమానులను సంబరాల్లో నింపారు చిత్ర యూనిట్. టీజర్ విషయానికి వస్తే మహేష్ బాబు చేతిలో ఓ ల్యాప్ టాప్ పట్టుకొని కాలేజీ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఈ టీజర్ లో చూపించారు. మహేష్ ఆలా నడుచుకుంటూ వస్తుంటే అమ్మాయిలంతా అయన వైపే చూస్తున్నారు.

ఇక దేవి శ్రీ బ్యాక్ గ్రౌండ్ కూడా అదిరిపోయింది. బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ చేసిన ఫస్ట్‌లుక్‌కి వరల్డ్‌వైడ్‌గా అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ‘మహర్షి’లో రిషిగా ఓ డిఫరెంట్‌ రోల్‌లో, కొత్త లుక్‌లో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించనున్నారు మహేష్‌. 2019 ఏప్రిల్‌ 5న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. కామెడీ కింగ్‌, హీరో అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇక మీరు టీజర్ ఫై లుక్ వెయ్యండి.