ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలలో భాగంగా డ్వా క్రా మహిళల లోన్లు మాఫీ చేస్తాం అనిప్రకటించారు . ఎన్నికల వరకు ఉన్న డ్వా క్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది . ఇప్పటివరకు డ్వా క్రాలోన్లు ఎవరైతే తీసుకున్నారో వారికి సంబంధించిన రుణాలను విడతల వారీగా మాఫీ చేస్తామని ప్రభుత్వం తెలియచేసింది.
ప్రస్తుత డ్వా క్రా మహిళలు ఎంత లోన్ కట్టాలో ప్రభుత్వం ఓ అంచనా వేసింది . వారి అకౌంట్ లో డబ్బును వాయిదా పద్ధతి లో కొంత చొప్పున వేస్తామని ప్రభుత్వం తెలియచేసింది . వారు కట్టాల్సిన డబ్బుని నాలుగు భాగాలు చేసి ,సంవత్సరానికి కొంత బ్యాంకు ఖాతా లో వేస్తామని తెలియచేసారు . మహిళలు తీసుకున్న లోన్ లో అసలు మాత్రమే ప్రభుత్వం మాఫీ చేస్తుంది , వడ్డీ మాత్రం ప్రభుత్వం మాఫీ చేయదని తెలియచేసారు .
ప్రభుత్వం విడుదల చేయనున్న రుణాలలో మొదటి విడత 2020 జనవరి 20 నుండి 25 మధ్య విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు . డ్వా క్రా మహిళలు తీసుకున్న లోన్లు కట్టాలని ,ఆ తర్వాత ప్రతి సంవత్సరం వారి ఖాతాల్లో వాయిదా ప్రకారం డబ్బు జమచేస్తామని తెలియచేసారు డబ్బు పూర్తిగా కట్టిన తర్వాత వారి ఖాతాల్లో డబ్బు పడుతుందా లేదా అనే అనుమానం చెందవద్దని ప్రభుత్వం తెలియచేసింది . పక్కాగా డ్వాక్రా రుణ మాఫీ జరుగుతుంది అని తెలియచేశారు.