ఈ జిల్లాలో పునర్వైభవం కోసం టీడీపీ ప్లాన్

ఈ జిల్లాలో పునర్వైభవం కోసం టీడీపీ ప్లాన్

0
87

పశ్చిమగోదావరి జిల్లాలో 2014 ఎన్నికల్లో 15కి 15 టీడీపీకి సీట్లు వచ్చాయి… కాని ఈ ఎన్నికల్లో టీడీపీ కేవలం రెండు స్ధానాలు మాత్రమే గెలుచుకుంది.. అది కూడా ఉండిలో శివరామరాజు అలాగే పాలకొల్లులో నిమ్మలరామానాయుడు, ఇద్దరూ కూడా టీడీపీ తరపున గెలిచారు.

అయితే జిల్లాలో కీలక నేతల సమావేశాలు పార్టీ బాధ్యతలు అన్నీ కూడా చంద్రబాబుకి అత్యంత నమ్మకస్తుడిగా మారిన నిమ్మలరామానాయుడు పాలకొల్లు ఎమ్మెల్యే చూసుకుంటున్నారు.. అంతేకాదు జిల్లాలో పార్టీ మీటింగులు రాష్ట్రంలో తెలుగుదేశం చేసే అన్నీ పోరాటాలకు వెళుతున్నారు.

ఇక ఉండి ఎమ్మెల్యే వెంకట శివ రామరాజు కూడా టీడీపీలో యాక్టీవ్ గానే ఉన్నారు.. అయితే ప్రతీ నియోజకవర్గంలో టీడీపీ కేడర్ పెరగాలి అని టీడీపీ మరింత యాక్టీవ్ అవ్వాలి అని , సెగ్మెంట్లో నేతలు గట్టిగా కష్టపడుతున్నారు.. గత పునర్వైభవం వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో టీడీపీకి రావాలి అని కష్టపడుతున్నారట.. అంతేకాదు రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తమ సత్తా చాటుతాం అంటోంది టీడీపీ.